మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 12 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ కులాల ముద్దుబిడ్డ ఎర్ర సత్యం అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సో మవారం జిల్లా కేంద్రంలో ఎర్ర సత్యం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీ వై స్‌చైర్మన్ వెంకటయ్య, నేతలు గణేశ్, శివరాజ్, గో పాల్‌యాదవ్, రామకృష్ణ, నవకాంత్, మాజీ ఎంపీపీ బా లరాజు, శ్రీనివాస్‌రెడ్డి, శివ, సుధాకర్ పాల్గొన్నారు.