మహ్మదాబాద్/గండీడ్, అక్టోబర్ 9 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బహు పరాక్రమవంతుడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గండీడ్ మండలంలోని వెన్నాచేడ్‌లో బుధవారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భం గా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మికులపై దాడులు భరించలేక సర్వాయి పాపన్న తిరుగుబాటు చేశారన్నారు. బహుజనుల అభివృద్ధికి ఆయ న ఎనలేని కృషి చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గీతాకార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.
సొసైటీల ఏర్పాటుకుగానూ లైసెన్స్‌ల కోసం 15శాతం రిజర్వేషన్లతో వైన్స్‌ల టెండర్లు ఇచ్చామన్నారు. గతంలో కార్పొరేషన్ నిధులు విడుదల చేశామని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేందుకు ఎందు కు వెనుకడుగేస్తుందో అర్థం కావడం లేదన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జనగాం జిల్లా కు పాపన్నగౌడ్ పేరు పెట్టాలని అసెంబ్లీలో ప్రస్తావించానన్నా రు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, గౌడ సంఘం ఐక్య సాధన సమితి అ ధ్యక్షుడు నారాయణగౌడ్, పాపన్నగౌడ్ యువజన సంఘం అధ్యక్షుడు దస్తయ్య, నాయకులు మారుతి కిరణ్, ఈశ్వరప్ప, పరమేశ్వర్, లక్ష్మీనారాయణ, శ్రీ నివాస్‌గౌడ్, శాంతి, ఈశ్వరయ్యగౌడ్, పుల్లారెడ్డి, గోపాల్, జితేందర్‌రెడ్డి, నారాయణ, రాంరెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య, రవికాంత్రెడ్డితోపాటు గౌడ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.