హన్వాడ : మండలంలోని బుద్దారం గ్రామంలో శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బొడ్రాయి (Bodrai) ప్రతిష్టాపనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పాల్గొని బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తిభావాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్ణాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ చెన్నయ్య, నాయకులు శ్రీనివాసులు, జంబులయ్య, మాధవులు, బసిరెడ్డి, హరిచందర్, వెంకన్న, తేజ వర్ధన్, యాదయ్య పాల్గొన్నారు.