మహబూబ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 27 : జిల్లా కేం ద్రంలోని బండమీదిపల్లి సమీపంలో ఉన్న బాగ్‌మార్‌సాబ్ దర్గా వద్ద నిర్వహించిన ఉర్సులో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకతీతంగా ప్రజలంతా కలిసి ఉండాలన్నారు.
తన హయాంలో దర్గా అభివృద్ధికి రూ.25లక్షలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. జిల్లాలో ఆలయాలు, దర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నా రు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, నాయకులు అహ్మద్ సనా, మోసీన్, మహమూద్, సుల్తాన్, వాజీద్, నవకాంత్, కౌన్సిలర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.