మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, జనవరి 5 : రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న చర్యలతో ఆడపిల్లలను కన్నెత్తి చూ డాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ఆకతాయిల బెదిరింపులకు భయపడవద్దని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
పాలిటెక్నిక్ కళాశాలలో ఆకతాయి బా త్రూంలో ఫోన్ పెట్టి వీడియో రికార్డు చేస్తే ఏమీ తెలియనట్లు కొందరు బుకాయించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరా రు. ఇలాంటి ఘటనలు కళాశాలలు, పాఠశాలల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాలయాల్లో విద్యార్తినులకు పూర్తిస్థాయి వసతులతో మౌలిక వసతులు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థినులు ఏ సమస్యలు వచ్చినా ఉపాధ్యాయు లు, అధ్యాపకులకు చెప్పుకునే విధంగా కళాశాలల్లో వాతావరణం కల్పించాలన్నారు.
ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలతోపాటు కావాల్సిన సౌకర్యాలపై అధికారులు అడిగి తెలుసుకోవాలని కోరారు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్కు బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని, రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు తీసుకువచ్చామన్నారు. అది పూర్తయితే విద్యార్థినులు నైపుణ్యం పెంచుకునేందుకు అవకా శం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.