నారాయణపేట, మే 1 : అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోకపోగా.. ఎంపీ ఎన్నికల్లో సైతం బూటకపు హామీలతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. మండలకేంద్రంలో బుధవారం కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మన్నె భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారన్నారు.
ఆయన కృషితోనే రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, రైల్వే బ్రిడ్జిల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ గతంలో ఏ ఒక్క నాయకుడు కూడా రాష్ట్ర సమస్యలపై తాను మాట్లాడినన్ని సార్లు పార్లమెంట్లో మాట్లాడలేదన్నారు. జాతీయ రహదారుల డివిజన్ కార్యాలయాన్ని సాధించామన్నారు.
ఎంఎస్ఎన్ ఫౌండేషన్ ద్వారా ఏడు అంబులెన్స్‌లను అందజేశామని గుర్తు చేశారు. మరోమారు అవకాశం ఇస్తే ప్రజల తరఫున పార్లమెంట్లో గళం విప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అనే వాస్తవాన్ని గ్రహించి ఎంపీ ఎన్నికల్లో మన్నెను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీలు అమలైతే కాంగ్రెస్‌కు.. లేదంటే బీఆర్ఎస్కు ఓటు వేయమని ప్రజలకు సూచించాలన్నారు. పాత నీరు పోతేనే కొత్త నీటికి విలువ వస్తుందని పార్టీ మారుతున్న వారిని ఉద్దేశించి అన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్‌కే ప్రజలు పట్టం కడతారన్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, జెడ్పీటీసీ లావణ్య, సీనియర్ నాయకులు భీమయ్యగౌడ్, కాన్కుర్తి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రవి, జ్యోతి, శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి, జగదీశ్, ప్రతాప్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, మే 1: ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ వార్డు, మండలం, హన్వాడ మండ లం కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి ప్రతి కార్యకర్త ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు అందించిన అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి ఓటు వేసేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ముడా మా జీ చైర్మన్ వెంకన్న, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేశ్, డీసీసీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, శివరాజ్ పాల్గొన్నారు.