మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 14 : గౌడ కులస్తులకు కౌడిన్య మహర్షి మూలపురుషుడు అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పే ర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద గురువా రం జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో కౌడిన్య జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సం దర్భంగా కౌడిన్య మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కౌడిన్య మహర్షి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జైగౌడ జాతీ య అధ్యక్షుడు రామారావుగౌడ్, గోపా అధ్యక్షుడు బండి సాయన్న, హరిశంకర్‌గౌడ్, సత్యం గౌడ్, వేములయ్యగౌడ్ పాల్గొన్నారు.