మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 22 : బుర్ర కథలు చెప్పి.. ఊర్లల్లో, పట్టణా ల్లో ఎల్లమ్మగుడి, మన్యంకొండ, యాదాద్రి యాడంటే ఆడ కాంగ్రెసోళ్లు దేవుండ్లు, దేవతల మీద ఒట్లు పెట్టి మరీ నమ్మించి నట్టేట ముంచారని, అన్నదాతలకు గులాబీ పార్టీ ఎ ల్లప్పుడూ అండగా ఉండి సమస్యలపై పోరాడుతామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. రుణమాఫీపై రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ పిలుపు మేరకు పాలమూరులో రైతులు, పార్టీ శ్రే ణులు కదం తొక్కారు.
మహబూబ్‌నగర్‌లోని తెలంగా ణ చౌరస్తాలో గురువారం రైతులతో కలిసి ధర్నా చేపట్టి మాజీ మంత్రి మాట్లాడారు. 42లక్షల మంది రైతులకు రూ.49వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి క్యా బినెట్లో రూ.31వేలు అని, బడ్జెట్ కేటాయింపుకొచ్చే సరికి రూ.7,500కోట్లు అంటూ రైతులను నిండా ముం చారన్నారు. సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మం డిపడ్డారు. అన్నదాతలు ఎంతో నిజాయితీ, ధర్మాత్ముల ని.. అటువంటివారు కాంగ్రెస్ మోసపూరిత మాటలు, వాగ్దానాలను నమ్మి ‘పాలిచ్చే బర్రెను విడిచిపెట్టి దున్నపోతులాంటి ప్రభుత్వాన్ని కొట్టంలో కట్టేసుకున్నారని’ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణ.. కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ఏడాది కూడా కాకముందే ప్రజలను కాంగ్రెస్ ముప్పతిప్పలు పెడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ నట్టేట ముంచిందని మండిపడ్డారు. 70-80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను సైతం కాంగ్రెస్ పట్టించుకోకుండా బురదజల్లేలా విమర్శలు చేస్తుంద న్నారు. కరివెన, ఉదండాపూర్ ప్రాజెక్టులు వెంటనే ప్రా రంభించాలన్నారు. సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతుభరోసా పంట కోతకొచ్చినా ఇచ్చే నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే మోసపోయామని రైతులే స్వయం గా చెబుతున్నారన్నారు.
ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా, రుణమాఫీ అర్హులందరికీ అందించేలా కొట్లాడుతామని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా ఆలోచన చేయకపోతే రైతుబంధు, బీమా ఇలా అన్ని విధాలుగా సాగుకు దూరమయ్యే పరిస్థితు లు దాపురించి వలసలు వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని పే ర్కొన్నారు. పేదబిడ్డల ఉన్నతికి తోడ్పాటునందించాల్సిన గురుకులాలు, వసతిగృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేయాలని, ఇందుకు అమరణ దీక్షకైనా సిద్ధమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ న ర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రహెమాన్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, నాయకులు ఉన్నారు.