మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 18 : అన్ని కులాలను ఏకం చేసి ఆసియా ఖండంలోనే 33 కోటలను జయించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహరాజ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ గ్రీన్‌బెల్ట్‌లో పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని పీడిస్తున్న మొఘల్ పాలకులకు వ్యతిరేకం గా పోరాడి, తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన గొప్ప వీరుడు పాపన్న మహరాజ్ అన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహ ఏర్పాటుకు జీవోతో పాటు ని ధులు విడుదల చేశామన్నారు. పాపన్న కోటకు మరమ్మతులు చేశామని, కోకాపేట్లో పా పన్న పేరుతో భవన నిర్మాణానికి రూ.ఐదు కోట్లు కూడా విడుదల చేశామన్నారు. పాపన్న తన సంపదను ప్రజలకు ధారదత్తం చేసిన మహరాజ్ అని కొ నియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలు దాదాపుగా మూడు వందలకుపైగా ఏ ర్పాటు చేశామని, ఆయన వారసులుగా గ్రామాల్లో గుడులు, బడులకు సహకారం అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, పాపన్న జీవిత చరిత్రను అందరికీ తెలిసేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్లు రవికిషన్, గణేశ్, నవకాంత్, ఆంజనేయులు ఆకుల శివ, జావెద్ తదితరులు పాల్గొన్నారు.