నిజమైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్
దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీఆర్ఎస్సేన ని... అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన గులాబీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మైనార్టీలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు.
- కేసీఆర్‌తో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం
- కాంగ్రెస్ సర్కారు వచ్చాకే కానుకలు నిలిచాయి..
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మైనార్టీలను విస్మరించిన పార్టీలకు బుద్ధి చెప్పాలి
- ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ అర్బన్, మే 2 : దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీఆర్ఎస్సేన ని… అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన గులాబీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మైనార్టీలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
మహబూబ్‌నగర్‌లో హజ్ హౌస్ నిర్మాణానికి రూ.కోటి నిధులు కూడా తీసుకొచ్చామన్నారు. అత్యాధునిక వసతులతో గురుకుల భ వనాల నిర్మాణానికి రూ.125కోట్లు, ఇమాం.. మౌసంలకు డబుల్ బెడ్రూంలు ఇచ్చిన విషయాన్ని మాజీ మంత్రి గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. కాంగ్రె స్ ఒక్కటై బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పండుగల వేళ పేదలకు కానుకలు నిలిచిపోయాయన్నారు.

ఇమాం.. మౌసంలకు గౌరవ వేతనాలు లేక కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. పదేండ్లలో పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. నా మినేటెడ్ పదవుల్లో కూడా ముస్లింలకు ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. అన్నివర్గాల సంక్షేమాన్ని కాంక్షించే ఏకై క పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రె స్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని ఎంపీగా పంపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారన్నారు.
మైనార్టీలకు అధిక ప్రాధాన్యం :ఎంపీ మన్నె
మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్.. బీజేపీ మైనారిటీలను విస్మరించాయన్నారు. ఇలాంటి పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో మైనారిటీ సీనియర్ నాయకులు రెహమాన్, మోసిన్, అహ్మద్, ఇమ్రాన్, మోసిన్ ఖాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

