ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. మంగళవారం జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో గులాబీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. తెలంగాణ తల్లి విగ్రహాలకు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. క్షమించు తల్లీ అంటూ వేడుకున్నారు. తెలంగాణతల్లి విగ్రహ స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహం పెడతారా సిగ్గు.. సిగ్గు.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వనపర్తి నుంచి గోపాల్పేట వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. అలాగే మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో, మహబూబ్‌నగర్, కోస్గిలో గ్రంథాలయ సంస్థల మాజీ చైర్మన్లు శాసం రామకృష్ణ, రాజేశ్వర్‌గౌడ్, కల్వకుర్తిలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, పెబ్బేరు, కొత్తకోట, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, జోగుళాంబ గద్వాలలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బాసు హన్మంతు, అయిజలో కురుమ పల్లయ్య ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. కేసీఆర్ ప్రభుత్వం సెక్రటరీయట్ ఎదుట భారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే.. ఈ ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
గోపాల్పేట, సెప్టెంబర్ 17 : తెలంగాణ శాశ్వతం.. తెలంగాణ ప్రజలు శాశ్వతమని పార్టీలు అధికారంలోకి వస్తూ, పోతూ ఉం టాయని, అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు శాశ్వతంగా మేలు జరిగే పనులు చేస్తే అవి గుర్తుండి పోతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు మంగళవారం గోపాల్పేట, రేవల్లి మండల కేంద్రాల్లో ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు.
గోపాల్పేట మండల కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, తెలంగాణ తల్లి విగ్ర హం ముందు పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించారు. అంతకుముందు ఆయన వనపర్తి జిల్లా కేంద్రం నుంచి బీఆర్ఎస్ శ్రేణుల తో కలిసి బైక్ ర్యాలీతో మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజాం సర్కారు భారత యూనియన్‌లో విలీనం తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆనాటి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం కుట్రతో ఆంధ్ర, తెలంగాణ ప్రాం తాలను సమైక్య రాష్ట్రం చేయడంతో ఆనాటి నుంచి స్వరాష్ట్ర కాంక్షకోసం ప్రజలు ఉద్యమించి, పోరాటంలో 1969 నుంచి 1972 వరకు 369 మంది అమరులయ్యారన్నారు. 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్న తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఉద్యమం ప్రభంజనమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. పదేండ్లుగా కేసీఆర్ సర్కారు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుతో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపారనప్నారు.
కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పదినెలల కాలం లో అన్ని విధాలుగా విధ్వంసం చేశారన్నారు. ఉచిత బస్సు తప్పా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, శాపనార్థాలు పెడుతున్నారన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై మాకు అపారమైన గౌరవం ఉంద ని, అతడు దేశం కోసం ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు వదిలాడన్న సానుభూతి ఉందని, కాంగ్రెస్ పార్టీ వారికి రాజీవ్‌గాంధీ మీద అంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు గాంధీభవన్ వద్ద ఆయన విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని దీనికి పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలన్నారు. సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడం ఇష్టం లేకనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ రాజీవ్‌గాంధీ విగ్రహ ఆవిష్కరణకు రాలేదన్నారు. అంబేద్కర్ సచివాలయం, అమరవీరుల స్తూపం మధ్యలో తెల ంగాణతల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్ సర్కా రు నిర్ణయించినట్లు, ఎన్నికలు రావడంతో సాధ్యం కాలేదని, ఆ స్థలంలో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సముచితంగా ఉండేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని సగౌరవంగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలించి, సచివాలం వద్ద తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రమేశ్‌గౌడ్, వైస్‌చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, పీఏసీసీఎస్ చైర్మన్ రఘువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలరాజు, నాయకులు రఘురామారావు, చంద్రశేఖర్, మతీన్, ఖా జా, తిరుపతియాదవ్, వేణుగోపాల్, మాధవరెడ్డి, ఉస్మాన్, ధర్మనాయక్, శేఖర్‌నాయక్, శ్రావణ్‌కుమార్, శ్రీనివాసులు, రవి, రాజు, రాములు, మణ్యం, రాజేశ్, తేజ, సత్యనారా యణ, శ్రీధర్‌రావు, శరత్‌బాబు, సురేందర్ రాములు, శివరాంరెడ్డి, రమేశ్, సునీల్, శ్రీశై లం తదితరులు పాల్గొన్నారు.