వనపర్తి, జూలై 24 : మండలంలోని చిమనగుంటపల్లి గ్రామ శివారులో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులను బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీటి సరఫరాతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడటానికి నియోజకవర్గంలో అ నేక హైలెవల్ బ్రిడ్జీలను నిర్మించినట్లు చెప్పారు.
అందులో కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మా ణ దశలో ఉన్నాయన్నాయి. నిర్మా ణ దశలో ఉన్న వాటిని కాంట్రాక్టర్లు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బాలీశ్వర్‌రెడ్డి, పురేందర్ తదితరులు ఉన్నారు.