వనపర్తి టౌన్/పెద్దమందడి, మే 25 : వనపర్తి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఆదివారం సోషల్ మీ డియా వేదికగా అసత్యపు ప్రచారాలు, వ్యక్తిగత దూషణలను కట్టడి చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వ గృహం నుంచి రాజీవ్‌చౌక్, కొత్త బస్టాం డ్ మీదుగా ఎస్పీ కార్యాలయం వ రకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఎస్పీతో బీఆర్ఎ స్ శ్రేణులు మాట్లాడుతూ శనివారం రాత్రి పెద్దమందడి మండ లం దొడగుంటపల్లికి చెం దిన సురేశ్, జంగమాయిపల్లికి చెందిన కొండల్‌ను ఎస్సై శివకుమార్ అక్రమంగా స్టేషన్లోనే నిర్భందించారని, దీనిని నిరసిస్తూ పెద్దమందడిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారని వెల్లడించారు. మం డలంలో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, దీనికి సమాధానంగా బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తే పోలీసులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు,అరెస్టుల పర్వం, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లో వ్యక్తిగత పోస్టులు పెట్టినా సహనంతో ఉంటున్నామని, ఇలా కార్యకర్తలను వేధిస్తే పార్టీ పరంగా కా ర్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నా ఏనాడు ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపులకు పాల్పడలేదని, అధికారంలోకి వచ్చి 18నెలలు గడవకముందే అక్రమ కేసులు పెట్టి మా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు.
వ్యక్తిగత విమర్శలు చే స్తూ కలుషి వాతావరణాన్ని సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని, వాట్సాప్‌లో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఏ పార్టీ వారైనా ఉపేక్షించవద్దని, క్షేత్రస్థా యి పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్, విజయ్‌కుమార్, పరంజ్యోతి, మాణిక్యం, రఘుపతిరెడ్డి, వేణుయాదవ్, బండారు కృష్ణ, నాగన్నయాదవ్, తిరుమల్, రహీం, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మాధవరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, జోహేబ్హుస్సేన్, గిరి, సునీల్, చి ట్యాల రాము, సురేశ్, ముద్దు, అలీం, వెంకట్, నాగరాజు, వెంకటేశ్‌సాగర్ తదితరులు ఉన్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా..
సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందుకు శనివారం అర్ధరాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం పెద్దమందడి పోలీస్ స్టేషన్ వద్ద బీ ఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మండలంలోని దొడగుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సురేశ్కుమా ర్, కొండన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్ర భుత్వ పనితీరును ప్రశ్నించడంతో అర్ధరాత్రి పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరు ను ప్రశ్నిస్తే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ప్రశ్నించడం ఏంటని అన్నారు. పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం పనిచేస్తున్నారా అని అన్నారు.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు పోస్టులు పెడితే తప్పు లే దు కానీ బీఆర్ఎస్ నాయకులు పోస్టులు పెడితే త ప్పుగా అనిపిస్తుందా అని వాపోయారు. సోషల్ మీ డియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్నోసార్లు పోస్టులు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చే యడం లేదని ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇలాంటి అ క్రమ అరెస్టులకు భ యపడేది లేదని వారన్నారు. కార్యక్రమంలో సేనాపతి, సింగిరెడ్డి కురుమూర్తి, పురుషోత్తం రెడ్డి, రాజు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.