వనపర్తి, మే 10 : నాగర్‌కర్నూల్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో మేధావులు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఓటు వేస్తామని స్వచ్ఛందంగా చెబుతున్నారని, దీంతో ఆర్ఎస్పీ గెలుపు ఖాయమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్, సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా భావించి కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేశారు. తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాలని ప్రజలు గ్రహించారని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు, కరువును ఆహ్వానించినట్లేనని ఆరోపించారు. మన నీళ్లు, మన నీరు, మన కాల్వలు, మన కరెంట్ మనకు రావాలంటే బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించుకోవాలని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, వార్డు బీఆర్ఎస్ నాయకులు ఆవులరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలి
యువత, విద్యార్థుల భవిష్యత్ బాగుపడాలంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదుట్ల, ఏదుల, చెన్నారం గ్రామాల్లో ఆర్ఎస్పీకి మద్దతుగా నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 80లక్షల మంది మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. మన ప్రాంతం వాడు, కష్టసుఖాలు తెలిసిన ఆర్ఎస్పీని గెలిపించుకుందామని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ చంద్రశేఖర్, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీలత, నాగమణి, రమేశ్, మాజీ ఉపసర్పంచులు క్రాంతిరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.