కడుపులో ఉన్న బిడ్డకూ.. సంక్షేమం అందించిన ఘనత కేసీఆర్‌ది
కడుపులో ఉన్న బిడ్డకు కూడా సంక్షేమం అందించిన ఘనత కేసీఆర్‌దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరం జన్రెడ్డి అన్నారు.
- మున్సిపల్ ఎన్నికల ప్రచార భేరీలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/ వనపర్తి టౌన్, ఫిబ్రవరి 3 : కడుపులో ఉన్న బిడ్డకు కూడా సంక్షేమం అందించిన ఘనత కేసీఆర్‌దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరం జన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి వన పర్తి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 5, 18, 19, 20, 21 వార్డుల అభ్యర్థులు గొర్ల ప్రేమ్‌కుమార్, మదన్, మురళీసాగర్, సునీల్ వాల్మీకి, పుట్ట ఆంజనేయులు తరఫున గాంధీనగర్ వీధిలో కార్నర్ మీటింగ్ ద్వారా ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పాత పట్టణాన్ని రోడ్ల విస్తరణ, మాతా శిశు సంక్షేమ కేంద్రం, క్రిటికల్ కేర్ సెంటర్ వంటి అభివృద్ధి పథకాలు తెచ్చి కొత్త పట్టణానికి దీటుగా తీర్చిదిద్దామన్నారు. సౌకర్యాలు పెరగడంతో భూముల విలువలు పెగిరి ప్రజలు ఆర్థికంగా ఎదిగారని ఇవన్ని ముందు చూపుతో చేశామన్నారు. చేసిన అభివృద్ధిని కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని రెండేళ్లలో తట్టె డు మట్టి తీసిన పాపాన పోలేదని ప్రజల్లో ఆలోచించి అండగా నిలిచి బీఆర్ఎస్ , మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించి గులాబీ జెం డాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ నిర్ణయాన్ని దిక్కరించిన వారికి ఇకపై పార్టీతో సంబంధం లేదన్నారు. అయితే నిరజంన్‌రెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.
అట్టహాసంగా బీఫామ్స్ పంపిణీ
బీఫామ్స్ అందుకున్న అభ్యర్థులు విజయం సాధించే వరకు విశ్రమించొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చా రు. సింగిరెడ్డి నివాసంలో బీఫామ్స్‌ను ఎన్నికల పరిశీలకుడు స్వామిగౌడ్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు అట్టహాసంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొంది పత్రం చేతికందేవరకు పట్టుదలగా పని చేయాలన్నారు. ఎన్నికల పరిశీలకుడు, మాజీ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ వనపర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని అందుకోవాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

