వైరా టౌన్, ఆగస్టు 17 : వైరా మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు గండగలపాడు గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కర్నాటి బాబురావు చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జున రావు వర్మ, విశ్వేశ్వరరావు, బాణాల వెంకటేశ్వరరావు, దొంతబోయిన చింతయ్య, కట్టా నాగేశ్వరరావు, నరసింహారావు, స్నేహసాగర్, మరికంటి శివ, ఏదినూరి శ్రీనివాస్, వేముల శివ కృష్ణ, కర్నాటి హనుమంతరావు పాల్గొన్నారు.