పెద్దమందడి, అక్టోబర్ 27 : అడ్డగోలు హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు రైతుభరోసా అడిగితే రైతులను చెప్పుతో కొడతామని అవమానించారని, అలాంటి వారి చెంపచెల్లుమనేలా రైతు నిరసన సదస్సును జయప్రదం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలంలోని అమ్మపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నేతృత్వంలో రైతుల సంక్షేమాని కి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతుకు పెట్టుబడి భారం కావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ఎకరాకు రూ.5 వేలు పెట్టుబడి సాయంగా 11విడుతలు అందించినట్లు తెలిపారు.
కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుం డా రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. పదేండ్లు సాగునీరు, పెట్టుబడిసాయం, ఎరువులు, విత్తనాల కు ఢోకా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రైతులు రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని అవమానించారని, ఇంకో మంత్రి రైతులను భయపెట్టాడని గుర్తుచేశారు. వానాకాలం సీజ న్ రైతుభరోసా ఇవ్వలేమ ని వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇ చ్చిన హామీలు అమలు చేయడం చేతగాక వ్యక్తిగత విమర్శల తో కాలక్షేపం చేయడం తప్పా ప్రజా సంక్షేమానికి పాటుపడి న దాఖలాలు లేవన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలే కాకుండా వృద్ధులు, వితంతువులు, మహిళలు, నిరుద్యోగులకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆరు గ్యారెంటీలతో అటకెక్కిన కాంగ్రె స్ పార్టీ వాటిని అమలు చేయకపోతే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామ ని ఏడాది కావస్తున్నా ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారని ప్ర శ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రాష్ట్ర ఖజానా ఏడింతలు పెరిగితెనే సాధ్యమవుతుందన్నారు. తలా తోక లేని హైడ్రా, మూసీ ముందరపెట్టుకొని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొనసాగే నైతిక హక్కు లేదని, ప్రజలే రోడ్డుపైకి వచ్చిన చెప్తున్నారన్నారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఆలోచన సీఎంకు, మంత్రులకు లేదని, ఆర్థిక వనరులు పూర్తిగా సన్నగిల్లి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ఈనెల 29న వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు నిరసన సదస్సుకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారని తెలిపారు. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు, మాజీ ఎంపీపీలు మన్నెపురెడ్డి, దయాకర్, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాగేంద్రంయాదవ్, సింగిల్‌విండో ఉపాధ్యక్షులు కుమార్‌యాదవ్, రామేశ్వర్‌రెడ్డి, జానకిరాములు, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వానకాలంలో పండిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే ప్రభుత్వం పైసలు ఇస్తాదా, లేదో గ్యారెం టీ లేదు సార్ అని పెద్దమందడికి చెందిన కృష్ణారెడ్డి అ నే రైతు కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో హామీ లు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంతో ఈ అనుమానం వచ్చిందని ఆవేదనతో అడిగారు. రాష్ట్రంలో పరిస్థితి అయోమయంగా మారిందని, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా అంటూ నైరాశ్యంలో ఉన్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు.