వనపర్తి టౌన్, డిసెంబర్ 30 : నేడు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై, ప్రజా నిర్బంధాలపై కవులు, కళాకారులు, మేధావులు స్పందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నేడు రాష్ట్రంలో సాగుతున్న అరాచక, ప్రజావ్యతిరేక పాలనపై, రైతులు పడుతున్న గోసను చూసి ‘కాంగ్రెస్ వచ్చిందిరా సాయన్న.. పంటలు ఎండుతున్నాయిరా.. నాగన్న’ అన్న పాట ను రాజనగరానికి చెందిన ఎరుపుల భరత్‌యాదవ్ రూ పొందించగా.. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిరంజన్‌రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భరత్ ప్రజల కష్టాలను కండ్లకు కట్టేలా మంచి పాటను రూపొందించారని అభినందించారు. ఈ పాటకు దండోరా నాయకులు మీసాల రామన్న సంగీత, దర్శకత్వం వహించినట్లు చెప్పారు. అనంతరం భరత్‌ను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో మీసాల రామన్న, గంధం నాగరాజు, కురుమూర్తి యాదవ్, వాకిటి శ్రీధర్, రమేశ్, గౌడ్, అశోక్, మాణిక్యం, కృష్ణ, నాగన్నయాదవ్, రహీం, గులాంఖాదర్ఖాన్, రవిప్రకాశ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నాగేంద్రం, మాధవ్‌రెడ్డి, ఇమ్రాన్, రాము, డానియేల్, శివ, లక్ష్మణ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.