గోపాల్పేట, డిసెంబర్ 9 : కేసీఆర్ సుదీర్ఘ పోరాటం వ ల్లే అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు ప్రక్రియకు సంబంధించి ప్రకటన చేసిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. నవంబర్ 29వ తేదీ నుంచి 11 రోజుల పాటు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా ఢిల్లీ పీఠం గడగడ వణికి డిసెంబర్ 9వ తేదీన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. అందుకే ఈరోజును విజయ్ దివస్‌గా జరుపుకొంటున్నామని తెలిపారు. విజయ్ దివస్ సందర్భంగా సో మవారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరంజన్‌రెడ్డి పూల మాలలు వేసి క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంతాచారి, అలాగే పోలీసు కిష్టయ్య, యాదయ్య, సువర్ణ తదితరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతోనే రాష్ర్టాన్ని సాధించి, అధికారం చేపట్టారన్నారు. బంగారు తెలంగాణ దిశగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ర్టాన్ని సంక్షే మం, అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇస్తామన్న హామీలన్నీ నీటమూటలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు.
దీంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారని వాపోయారు. తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు మరో ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కేసీఆర్‌కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బస్టాండ్ సమీపంలో నూతనంగా ఆవిష్కరించిన మహనీయులు జ్యోతిభాఫూలే, డా క్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం మున్ననూర్‌కు చెందిన సోడె వెంకటయ్య, అతడి భార్య సోడె చిట్టెమ్మ జూలై 23న ఇం ట్లో గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ఒక్కొక్కరికీ రూ2 లక్షల చొప్పున ఇద్దరికి రూ.4 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులకు చెందిన చెక్కులను మృతుల కుమారులు మల్లేశ్, హర్షవర్ధన్‌కు నిరంజన్‌రెడ్డి అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్‌గౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, పీఏసీసీఎస్ చైర్మన్ గువ్వల రాములు, నాగవరం విండో అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు, రైతుబంధు మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, నాయకులు చంద్రశేఖర్, మ తీన్, రాజేశ్‌గౌడ్, భాస్కర్, మన్యం, కాశీనాథ్, రవి, రాజు, రాములు, మన్సూర్, యాది, శ్రావణ్, వెంకటయ్య, గోపాల్‌రావు, వెంకటేశ్, శ్రీనివాసులు, శంకరయ్య, కృష్ణయ్య, నాగరాజు, శ్రావణ్, శేషిరెడ్డి, తిరుపతయ్యగౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.