వనపర్తి టౌన్, నవంబర్ 9 : ఎంతో ప్రఖ్యాతి కలిగి న సదర్ ఉత్సవాలను వనపర్తిలో నిర్వహించ డం అభినందనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నా రు. శనివారం పాలిటెక్నిక్ క ళాశాల మైదానంలో సదర్ ఉత్సవాలను సంతోష్‌యాదవ్, సాయిప్రసాద్ నిర్వహించగా.. నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు పాతకోట ఆలయంలో పూజ లు చేశారు. కార్యక్రమం లో శ్రీను, మహేశ్, రమేశ్‌గౌడ్, హేమంత్, కురుమూర్తి, నాగన్న పాల్గొన్నారు.