వనపర్తి టౌన్, డిసెంబర్ 29 : మహిళా, ఉన్నత విద్యాభివృద్ధికి రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి కృషి ఎనలేనిదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి హాస్టల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. వెంకట్రామిరెడ్డి ముందుచూపుతో ఆనాడే మహిళల కోసం ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు చేశారన్నారు.
మహిళల విద్యను ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. 106 ఏండ్ల కిందట దేశాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాలని, ముందుచూపుతో ఆలోచన చేసి, మెరికల్లాంటి విద్యార్థులను తయారు చేసి దేశానికి అందించిన ఘనత రెడ్డి హాస్టల్దేనని అన్నారు. నేటి సాంకేతికతతో పోటీపడి ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయ విధానాన్ని అందించి రాబోయే తరాల కోసం ఈ సంస్థ తోడ్పాడాలని ఆకాంక్షించారు. రాజాబహద్దూర్ సేవలను కొనియాడారు.