జడ్చర్ల, సెప్టెంబర్ 2 : ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. ఉట్టి ప్రగల్భాలు మానుకొని బాలానగర్-గంగాపూర్ డబుల్‌లేన్ రోడ్డుకు కొత్త జీవోను తెచ్చే దమ్ముందా..? అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. ఈ రోడ్డు వేయడానికి తన హయాంలో 19 జూలై 2023లో జీవో రాగా.. టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యాయని, అం తలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయని తెలిపారు. కానీ అది మంజూరే కాలేదని కేవలం ఒక కాగితం మాత్రమే తీసుకొచ్చారని, ఎన్నికల తర్వాత తాను రోడ్డు వేయడానికి జీవోను తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారని, రీ టెండర్‌ను వేయడం జరిగింద ని, అతను తీసుకొచ్చిన జీవోను చూపించాలన్నారు.
సోమవారం పట్టణంలోని ప్రేమ్‌రంగా గార్డెన్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడు తూ పోలేపల్లి సెజ్‌లోని కంపెనీల నుంచి సీఎన్ఆర్ ఫౌండేషన్ ఖాతా లో డబ్బులు వేయించుకున్నారని ఎమ్మెల్యే ఆరోపణలు నిరాధారమన్నారు. ఫౌండేషన్‌కు గాని, తన సంబంధిత ఖాతాల్లో గానీ ఒక్క రూ పాయి వేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు, పదవుల నుంచి తప్పుకొంటానని, లేకుంటే నీవు ముక్కు భూమికి రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించారు. సెజ్ కంపెనీల నుంచి నెలకు రూ.70 లక్షలు వస్తున్నాయని చెబుతున్నారు కదా.. మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది.. ఇప్పటివరకు రూ.6 కోట్లకుపైగా వచ్చిన వాటిని ఎక్కడ దాచారో చెప్పాలన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉ న్న సమయంలో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, ఎక్కడైనా జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. లేకుంటే తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలన్నారు. మున్సిపాలిటీలో కబ్జాలంతా గత కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, ఊరచెరువులో ఉన్న వెంచర్‌కూ వారి హయాంలోనే అనుమతినిచ్చారన్నారు. కబ్జాలపై కమిటీ వేసి నిజాలు తేలుద్దామన్నారు. స్థానిక వందపడకల దవాఖాన భవనం లోలెవల్‌లో నిర్మించారని తరచూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే పట్టణం నడిబొడ్డున మూడెకరాల స్థలం ఇప్పిస్తే వచ్చే వర్షాకాలంలోగా సేమ్ బిల్డింగ్‌నే కట్టించి ద వాఖానకు ఇస్తానన్నారు.
దవాఖాన నిర్మాణ సమయంలో జడ్చర్ల-కల్వకుర్తి రోడ్డు కిందకు ఉండేదని.. రోడ్డు విస్తరణప్పుడు ఎత్తు పెంచారన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్ర భాకర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, కౌన్సిలర్లు దేవా, లత, చైతన్య, నందకిశోర్, మహేశ్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మురళి, యాదయ్య, మురళి, రామ్మోహన్, నాగిరెడ్డి, శ్రీకాంత్, ఇంతియాజ్‌ఖాన్, శంకర్‌నాయక్, శ్రీ నివాస్‌రెడ్డి, నర్సింహులు, శ్రీనివాస్‌యాదవ్, నర్సింహులు, బాలు, శ్రీను, హఫీజ్ ఉన్నారు.