జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 26: రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గులాబీ జెండాపండుగను శనివారం బీఆర్ఎస్ శ్రేణులు జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట కావేరమ్మపేటలో పార్టీ జెండాను ఎగురవేసి సంబురాలు జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా పార్టీశ్రేణులు పెద్దఎత్తున పటాకులు కాల్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జడ్చర్ల మున్సిపాలిటీలోని 27వార్డులతోపాటు మండలంలోని గంగాపూర్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..వరంగల్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం కనీవిని ఎరుగని రీతీలో జరుగుతుందని.. జిల్లా నుంచి దండులా తరలిరావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, మహేశ్, జ్యోతికృష్ణారెడ్డి, శశికిరణ్, సారికా రామ్మోహన్, దేవ, బీఆర్ఎ స్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు యాదయ్య, స త్యం, మురళి, హఫీజ్, శంకర్‌నాయక్, రవీందర్‌గౌడ్, శ్రీనివాసులు, శ్రీనివాస్‌యాదవ్, ఇర్ఫాన్, శేఖర్‌రెడ్డి, కరాటేశ్రీను, పవన్, పరమటయ్య, తదితరులు పాల్గొన్నారు.