నవాబ్‌పేట, నవంబర్ 16: మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి శనివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు లక్ష్మారెడ్డి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ కా ర్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉం టూ.. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. వారి వెంట కేటీఆర్ ఉన్నారు.