జడ్చర్లటౌన్/ బాలానగర్/నవాబ్‌పేట, అక్టోబర్ 6 : కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సోమవారం జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, బాలానగర్, నవాబ్‌పేట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయని, రైతులు యూరియా బస్తా కోసం రోడ్లపై పడిగాపులు కా యాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆచరణ లో అమలుగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ గ్యారెంటీ బాకీ కార్డులను ప్రతి గ్రామంలో ఇం టింటికీ తిరిగి ప్రజలకు వివరించి అందజేయాలన్నారు. రాను న్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలందరూ కలసికట్టు గా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని కోరా రు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యచరణపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బాలానగర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు వాల్యానాయక్, చెన్నారెడ్డి, వెంకటాచారి, లక్ష్మణ్‌నాయక్, సుధాకర్‌రావు, గోపాల్‌రెడ్డి, జగన్నాయక్, లిం గూనాయక్, సుప్ప ప్రకాశ్, బాలునాయక్, బాలయ్యతోపాటు జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు చెందిన మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ గ్రామా ల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.