మదనాపురం, నవంబర్ 20 : మదనాపురం మండలంలక్ష్మీపురం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు పరిశీలించి, రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు శాంతమ్మ, లక్ష్మయ్య మాట్లాడు తూ ‘కేసీఆర్ ఉన్నప్పుడే రైతుల బతుకులు బాగుండే.. 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం కింద రైతుబంధు సరైన సమయంలో ఇవ్వడంతోపాటు ధాన్యం కొనేది.
ఇప్పు డు కాంగ్రెస్ పాలనతో ఇవన్నీ కనిపించడం లేదు. చేతికొచ్చిన పంటను ప్రభుత్వానికి అమ్మితే మద్దతు ధరతోపాటు బోనస్ వస్తాయని ఆశపడితే ఉత్తదే అయ్యింది. పంటకోసి నెలరోజులుగా ఎదురుచూసినం. చివరికి బయట రూ.2,100కు అ మ్ముకున్నం. పాలిచ్చే (బీఆర్ఎస్) ప్రభుత్వాన్ని వదులుకొని దున్నపోతు (కాంగ్రెస్)ను తెచ్చుకున్నం’ అని మాజీ మంత్రు లు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎదుట వాపోయారు.
రైతు కృష్ణయ్య మాట్లాడుతూ ‘సీఎం రేవంత్‌రెడ్డి రైతులందరికీ రుణమాఫీ చేశామని చెప్పుకుంటుండు. కానీ నాలాంటి చాలామందికి మాఫీ కాలేదు’ అని విచారం వ్యక్తం చేశాడు. ఇందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరు గ్యా రెంటీల పేరిట మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డా రు. ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యే వరకు ప్రజల కోసం బీఆర్ఎస్ తరఫున కొట్లాడుతామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.