మూసాపేట(అడ్డాకుల)/భూత్పూరు, డిసెంబర్ 4 : పల్లెపల్లెనా గులాబీ జెండా ఎగురాలే.. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే రెండేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. గురువారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో అడ్డాకుల మండలానికి చెం దిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో కారెక్కగా.. గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇ చ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. అందుకే ప్రజల్లో రేవంత్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీలో అభ్యర్థులు ఓట్లు అడగడానికి వెళ్తే గ్యారెంటీలపై నిలదీయాలన్నారు. రైతులు, సాధారణ ప్రజల మద్దతు బీఆర్ఎస్ వైపే ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు పార్టీశ్రేణులు వివరించి పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయంతోనే స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులంతా ఏకాభిప్రాయంతోనే నామినేషన్లు వేయాలని, భేదాభిప్రాయాలతో ఎవరూ ముందుకు వెళ్లవద్దని సూచించారు. సమిష్టిగా ఉంటేనే విజయం సాధ్యమవుతుందన్నారు.
వార్డు నుంచి సర్పంచ్ వర కు పార్టీ లైన్లోనే నడుచుకోవాలని, ఒంటరిగా పోటీ చేసి ఇబ్బందుల్లో పడొద్దని కోరా రు. పార్టీలో చేరిన వారిలో అడ్డాకుల మం డలం కందూరుకు చెందిన బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి రమేష్, మాజీ ఉపసర్పంచ్ శంకర్, భూత్పూర్ మండలం మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, నాగరాజుగౌడ్, అంజనేయులుగౌడ్, బొం బాయి బుచ్చయ్య, రవికుమార్, చాకలి రాకేశ్, వ ల్లూరు ఆసన్న యాదవ్, ఈరమల్ల కొండన్న యాదవ్, డాకారయ్య యాదవ్, మహేశ్, రామస్వామి, రవి, సతీశ్, అలాగే మద్దిగట్లకు చెందిన విద్యావంతుడు సురేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలతో స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. అధికార పార్టీ నాయకులు వెంకటేశ్, నరేష్, వెంకటయ్య, ఆంజనేయులు, నాగయ్య, చి న్న నర్సింహులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, చెన్నయ్య, రాములు, శివధను, రవికుమార్, కుర్మయ్య పాల్గొన్నారు.