మహబూబ్‌నగర్ , సెప్టెంబర్ 26 : ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. టూరిజం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్ర తిష్టలు, తద్వారా ప్రపంచ స్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు నిస్తాయి. ఒకప్పుడు వలసలకు కేరాప్‌గా నిలిచినా పాలమూరు జిల్లా ఇ ప్పుడు పర్యాటకంగా విశేషంగా ఆకర్షిస్తోంది. తె లంగాణ ఆవిర్భావం, జిల్లాల విభజన అనంత రం టూరిజం అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నది. శిల్పారామం, మినీట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రి డ్జి, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, ఆడ్వెంచర్ల వి న్యాసాలు, ఆకట్టుకునే కూడళ్లు, పిక్నిక్ స్పాట్లు, ఇలా ఎన్నో పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వ ర్గాల వారికి వినోదం, విజ్ఞానంతోపాటు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నది.
పర్యాటక అభివృద్ధికి కేసీఆర్ సర్కారు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో జిల్లాలో పర్యాటకంగా అనేక అభివృద్ధి పనులు నిర్వహించడంతో జాతీయ, అంతర్జాతీ య పర్యాటకులను ఆకర్షించేలా రూపుదిద్దారు. ముఖ్యంగా మయూరీ హరితవనం (కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు) పిక్నిక్ స్పాట్‌గా రూపుదిద్దుకున్నది. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి శివారు లో 2,087 ఎకరాల్లో పచ్చదనం పరుచుకున్న ఈ పార్కు ఆహ్లాదాన్ని పంచుతున్నది. బర్డ్ ఎన్‌క్లోజర్, రెయిన్ ఫారెస్టు, వాటర్‌పాల్స్, మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, జీప్ సైకిల్, జిప్ లైన్, టోటింగ్, టైర్ వాక్, ఆర్చరీ జోన్, వాల్ ైక్లెబింగ్, హిల్ వ్యూ పాయింట్, ఫ్లాగ్ పాయింట్, బొమ్మలు తదితర వాటిని ఏర్పాటు చేశారు.
ట్యాంక్ బండ్ సమీపంలో రూ. 13 కోట్ల నిధులతో 6.80 ఎకరాల్లో మినీ శిల్పారామం ఏర్పాటు చేశారు. సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేసిన గ్రీనరీ ఎంతో ఆకట్టుకుంటున్నది. ఆవరణలో స్టాళ్లతోపాటు సమావేశాల కో సం ఆడిటోరియం నిర్మించారు. శిల్పారామం పక్కన రెండు ఎకరాల స్థలంలో రూ.24 కోట్లతో అడ్వెంచర్ గేమ్స్, వాటర్ పార్క్ పనులు టెండర్ దశలో మిగిలిపోయాయి.
మినీ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన తీగల వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జి)ను అంతర్జాతీయ ప్ర మాణాలతో ఆద్భుతంగా నిర్మించారు. ట్యాంక్ బండ్ నుంచి ఐలాండ్ వరకు రూ.14 కోట్లతో ఈ బ్రిడ్జిని కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించారు. ప్ర స్తుత సర్కారు దానిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. బ్రి డ్జికి అవసరమైన సామగ్రిని దక్షిణ కొరియా నుం చి తెప్పించారు. బ్రిడ్జి పొడవు 850 అడుగులు, ఎత్తు 90 అడుగులు, వెడల్పు ఐదు అడుగులుగా ఉన్నది. బ్రిడ్జిపైకి ఏకకాలంలో 200 మంది పర్యాటకులు ఎక్కి వెళ్లవచ్చు. బ్రిడ్జిని నాలుగు స్తంభాలు, 18 పిల్లర్లతో నిర్మించారు.
నాటి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో జిల్లా కేం ద్రంలో రూ.18 కోట్లతో ప్రధాన కూడళ్లు సుందరీకరణ పనులు చేపట్టారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ చౌరస్తాలో కప్ సాసర్, నీటితొట్టె ఫౌంటేన్ ఏ ర్పాటు చేశారు. అదేకూడలి సమీపంలో సుభాష్ చంద్రబోస్, గౌతమ బుద్ధుడి విగ్రహాలతోపాటు నీటి ఫౌంటేన్‌ను ఏర్పాటు చేశారు. మెట్టుగడ్డ చౌ రస్తా సమీపంలో పాలమూరు బ్రాండ్ పిల్లల మ ర్రి చెట్టు ఆకారం, మన మహబూబ్‌నగర్ సెల్ఫీ పాయింట్‌ను నిర్మించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేష న్ సమీపంలో నిర్మించిన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గాంధీ రోడ్డు పాఠశాల వద్ద వివిధ బొమ్మలు, చెట్టు ఆకారాలను తీర్చిదిద్దారు. క్లాక్‌టవర్ చౌరస్తా, జాతీయ నాయకుల విగ్రహాలు, భారీ గడియారాలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద వివిధ కులవృత్తులను ప్రతిబింబించేలా విగ్రహాలు, ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. పా ల్కొండ సమీపంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలో హ్యాండ్ ఫాంటేన్ అబ్బురపరుస్తున్నది.
జిల్లా కేం ద్రంలో పర్యాట క పనులు నిలిచిపోయాయి. కాంగ్రె స్ అధికారంలోకి రా వడంతో ఈ పనుల వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆ రోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన పలు పనులు నేడు ప్రశ్నార్థకంగా మారాయి. పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్ ఇప్పటికైనా ఈ పనులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.