కొల్లాపూర్, మార్చి 13 : నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల దాహార్తి తీ ర్చేందుకు అతి కీలకమైన కొల్లాపూర్ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు సాసర్లు ఏర్పాటు చేశారు. కానీ సాసర్లల్లో నీటిని నింపక వన్యప్రాణులు దాహార్తికి అడవిని దాటే ప్రమాదమున్నది. మార్చి ఆరంభంలోనే 39డిగ్రీల ఎండలు కొడుతున్నాయి. ఇప్పటికే అడవిలో కుంటలు, వాగుల్లో నీటి చెలిమలు ఆవిరయిపోయి ఉంటాయి.
గతంలో కృష్ణానది తీరం వెంట దాహం తీర్చుకునేందుకు వచ్చిన పెద్దపులులను సమీప గ్రామాల ప్రజలు జంకుతే.. దాహం తీర్చుకునేందుకు వచ్చిన అడవి గొర్రెలు, దుప్పిలు వేటాగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఘటనలు నెలకొన్నాయి. మళ్లీ అలాంటి ఘటనలు పునఃరావృతం కాకుండా ఉండాలంటే అడవిలో జంతువులు దాహం తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన సాసర్లు, కుంటలను నీటితో నింపాల్సిన అవసరం ఉన్నది.
కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 36,872 హెక్టార్లలో దట్టమైన అడవి విస్తరించి ఉన్న ది. గత లెక్కల ప్రకారం 13 పెద్దపులులతోపాటు చిరుత పులులు, వందలాది శాఖహార జంతువులున్నాయి. ఎండకాలంలో దాహార్తిని తీర్చుకునేందుకు అడవి దాటి బయటకు రాకుండా ఉండేందుకు అటవీశాఖ పదుల సంఖ్యలో సాసర్లతోపాటు కృత్రిమ కుంటలు, బోర్లను ఏర్పాటు చేసిం ది. కానీ మార్చిలో ఎండలు ముదిరినా సాసర్లలో నీళ్ల నింపలేదు. దాహం అవుతోందని అడగలేని ముగజీవాలపై సంబంధిత శాఖ నిర్లక్ష్యం నీళ్లులేని సాసర్ తొట్లతో స్పష్టమవుతున్నది.
తమ గ్రామంలో నల్లమల, కృష్ణానది తీరానికి మధ్య లో ఉంటుంది. మా గ్రామానికి వెళ్లే దారిలో ఉండే సా సర్లలో నీళ్లులేవు. కొన్నినెలల కిందట మా గ్రామానికి సమీపంలో పెద్దపులి మృతి చెందింది. దీంతో మా గ్రామ ప్రజలు భయాందోళన గురవుతున్నారు. దా హం కోసం వచ్చి ఎక్కడ దాడి చేస్తాయోనని భయపడుతున్నారు.
– భరత్, అమరగిరి
నల్లమల అభయారణ్యం మన ప్రాంతానికి మా ణిక్యం లాంటింది. అందులోని అడవి జంతువులను కాపాడుకోవాల్సి బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి అడవి జంతువులకు దాహార్తి తీర్చేంచేందుకు ఏర్పాట్లు చేయాలి.
– రమణ, జానవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు