గద్వాల, నవంబర్ 1 : సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి పేద విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఇందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లు.. గురుకులాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నా యి. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకే రోజు వ్యవధిలో వరుసగా రెండు ఘటనలు చోటుచేసుకున్నా యి. వసతి గృహాలకు సరఫరా చేసే వస్తువులను తని ఖీ చేయాల్సిన నాణ్యత పరిశీలన అధికారులు పత్తాలేకుండా పోవడంతో బీసీ వసతి గృహంలో 54మం ది, ఎస్సీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి తర్వాత తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతోనే వరుస ఘటనలు చో టుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంటకు వినియోగించే సరుకుల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారా తెలిసిం ది. పేరుకు మాత్రమే ఫుడ్ కమిటీలు ఉన్నాయి. వం ట కార్మికులు ప్రయోగాలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శుక్ర, శనివారాల్లో వ సతి, గురుకులంలో జరిగిన ఘటన సమయంలో ఫు డ్ కమిటీ సభ్యులు భోజనం చేయలేదా అనేది తెలియాల్సి ఉన్నది. ఫుడ్ కమిటీ సభ్యులు భోజనం చేశా కే మిగతా విద్యార్థులు తింటున్నారని చెప్పడం అబద్దమని జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తున్నది.
ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ వసతిగృహంలో శుక్రవారం రాత్రి విద్యార్థులకు క్యాబేజీ, కాలీఫ్లవర్ రెండూ కలిపి వంట చేయగా తిన్న విద్యార్థులు గంటలోపే వాం తులు చేసుకున్నారు. 54 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. చారులో కారం తేలి ఉందని, ఇది కూడా ఫుడ్ పాయిజన్ కావడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో విద్యార్థులు ఇంకా కోలుకోకముందే అదే మండలంలో అయిజ ఎస్సీ గురుకు లం ఉన్నది. అక్కడ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు శ్రీను, భర త్, అఖిల్ అస్వస్థతకు గురికాగా, వారిని జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీటికన్నింటికీ కారణమని వసతిగృహలకు సరఫరా చేసే స రుకులతోపాటు, కూరగాయలు నాణ్యతలేనివి సరఫ రా చేయడం కారణంగా బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వసతిగృహాలపై మరింత పర్యవేక్షణ పెంచాల్సి ఉన్నది.

గద్వాల దవాఖానలో కలెక్టర్ సంతోష్ విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
ఇటిక్యాల, నవంబర్ 1 : ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన మరువకముందే ఎర్రవల్లి మండల కేంద్రంలోని గురుకులంలో ఇంటర్ చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు శనివారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. శనివారం పాఠశాలలో జీరారైస్, పల్లీల పొడితో విద్యార్థులకు అల్పాహారం అందించారు. సీనియర్ విద్యార్థులు భరత్, శ్రీను, అఖిల్‌కు వాంతులయ్యాయి. వీరిని చికిత్స కోసం గద్వాల ఏరియా దవాఖానకు తర లించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రిన్సిపాల్ రామాంజనేయులు తెలిపారు. ఘటన అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు పాఠశాలను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వసతిగృహాల నిర్వాహణపై నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హనుమంతు నాయుడు అన్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన శనివారం పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్శిటీ అధ్యక్షుడు గడ్డం భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గద్వాల జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా, ప్రభుత్వ పాఠశాలల్లో తరచూగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. దీన్నిబట్టే విద్యార్థులకు ఏ రకమైన భోజనం అందిస్తున్నారో అర్థమవుతున్నదన్నారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో బషీర్, హఫీజ్ ఉన్నారు.
ఇటిక్యాల, నవంబర్ 1 : ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల చారు.. తింటుంటే పురుగులు కనబడుతున్నాయ్.. అయినా గత్యంతరం లేక.. కాలిన కడుపుతో ఉండలేక అలాగే తింటున్నామని ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థులు తమ గోడును వెల్లబోసు కున్నారు. శుక్రవారం రాత్రి విదార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనపై వసతిగృహాన్ని బీసీ సంక్షేమ శాఖ సీఈ వో అలోక్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ లక్ష్మి తనిఖీ చేశారు. విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకోగా వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు.
వార్డెన్ విధులకు సరిగా హాజరుకావడం లేదని, వర్కర్లు నాణ్యమైన భోజనం అందించకపోగా, తిట్టడం, కసురుకోవడం జరుగుతుందన్నారు. రోజూ ఉదయం నీళ్లపాలు, మెనూలో కొద్ది మోతాదుగా చికెన్ పెట్టినా నీళ్లుగా ఉండ డంతో తినలేకపోతున్నామన్నారు. పుచ్చు పట్టిన పల్లీలతో చట్నీ తయారు చేస్తారని, అన్నంలో పురుగులు వస్తాయని వాపో యారు. కనీసం తాగడానికి నీళ్లు ఉండవన్నారు. శుక్ర వారం రాత్రి క్యాబేజి, కాలీప్లవర్ రెండూ కలిపి ఉడికీ ఉడకని కూర, సాంబారు, మజ్జిగ, గుడ్డు, అన్నం పెట్టారన్నారు. తిన్న గంట తర్వాత ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నామని వెల్లడించారు. మజ్జిగ, అన్నం, గుడ్డు తిన్నవారు బాగున్నారని తెలిపారు.
ఫుడ్ పాయిజన్‌తో 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, గద్వాల దవాఖానలో చికిత్స అనంతరం 32మందిని శనివారం ఉదయం హాస్టల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 23 మంది అబ్జర్వేషన్లో ఉన్నారన్నారు. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని, వార్డెన్ జయరాములును సస్పెన్షన్ చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి తెలిపారు. అలాగే వర్కర్లలో మార్పు ఉంటుందన్నారు. కాగా, అలంపూర్ బీసీ హాస్టల్ వార్డెన్ శేఖర్‌కు ధర్మవరం హాస్టల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిందని, నూతన భవనానికి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి సిద్దప్ప, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి అక్బర్‌బాష, ఎస్బీ సీఐ వెంకటేశ్వరరావు, తాసీల్దార్ నరేశ్, వైద్యురాలు ఇందిర, ఎస్సై మురళి పాల్గొన్నారు.
ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటగా స్వీకరించింది. 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమగ్ర నివేదికను నవంబర్ 24వ తేదీ ఉదయం 11గంటల వరకు అందించాలని గడువు విధించింది.