జడ్చర్ల, ఆగస్టు 7 : పట్టణంలోని మైనార్టీ బా లుర ఇంగ్లిష్ మీడియం గురుకుల పాఠశాల వి ద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం అల్పాహారంగా కిచిడీ భుజించాక ప్రార్థ న అనంతరం 10 గంటల సమయంలో ఫుడ్‌పాయిజన్‌తో కడుపు నొప్పి, వాంతులకు గురయ్యా రు. దాదాపు 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురికాగా పాఠశాల సిబ్బంది స్థానిక వైద్యులకు సమాచారమిచ్చారు.
డాక్టర్లు వచ్చి పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థుల కు చికిత్సలు అందించారు. అయితే అందులో 9 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా.. అంబులెన్స్‌లో జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని డాక్టర్లు తెలిపారు.
గురుకులానికి కలెక్టర్, అధికారులు
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిరబోయి, అదనపు క లెక్టర్ విజయేంద్రప్రతాప్ పాఠశాలకు చేరుకొని పరిసరాలను, వంట గదిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం కిచిడి తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి రాగా.. వై ద్యులతో చికిత్స అందించినట్లు తెలిపారు. కొం చెం ఎక్కువగా బాధపడుతున్న వారిని దవాఖానకు తరలించామన్నారు.
మెనూ ప్రకారం ఆహా రం ఇవ్వడం లేదని ఆమె దృష్టికి తీసుకురాగా.. అన్ని వసతి గృహాలను తనిఖీ చేసి మెనూ ప్రకా రం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంపాటు పాఠశాలలో భోజనాన్ని పరిశీలించాలని తాసీల్దార్ సత్యనారాయణరెడ్డిని ఆదేశించా రు. ఏసీ విజయేంద్రప్రతాప్ మధ్యాహ్నం వరకు పాఠశాలలోనే ఉండి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నీటి శాంపిల్స్‌ను సేకరించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్‌వో సంధ్య, డీడీఎంహెచ్‌వో శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో విజయ్‌కుమార్, డాక్టర్ సునీ ల్ ఉన్నారు.