కొల్లాపూర్, నవంబర్ 10 : ఉన్నత విద్యకు ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా ఆచరణలో మాత్రం విద్యార్థుల దరి చేరకపోవడంతో పట్టభద్రులు పస్తులుంటున్నా రు. పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొ ల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యార్థులు అర్థాకలితో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. 2014లో ప్రారంభమైన పీజీ సెంటర్లో 2020 వరకు కరోనా వరకు విద్యార్థులకు హాస్టల్ భోజన సదుపాయం ఉండేది. కరోనా అనంతరం బిల్డింగ్ నిర్మాణంతో భోజన వసతి నిలిచిపోయింది. దీనికి తోడు ప్రభుత్వం మారడంతో ఉన్నత విద్యార్థులకు హాస్టల్ ఉన్నా భోజన వసతి లేకుండాపోయింది. ఎంతో మంది అధికారులు, పాలకుల దృష్టికి పీజీ సెంటర్ హాస్టల్లో భోజన వ సతి గురించి మొరపెట్టుకున్న లాభం లేకుండా పోయింది.
2024 విద్యాసంవత్సరం నాటికి పీజీ సెంటర్లోని ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లిష్, ఎంఎస్సీ మాథ్స్, ఎంకామ్, మాస్టర్ ఆఫ్ సోషియల్ వర్క్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ మొ త్తం ఆరు ఉన్నత విద్య కోర్సుల్లో 263 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే థర్డ్ఫెజ్ కౌన్సెలింగ్ పూర్త య్యింది. సోమ, మంగళవారాల్లో మరికొంత మంది చేరే అవకాశం ఉంది. క్లాసులు రెగ్యులర్‌గా నడుస్తున్న అర్ధాకలితో చదువుపై ద్యాస ఉంచలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్ రూంలోనే వంట చేసుకొని తిని క్లాసులకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువులు మధ్యలో ఆగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీజీసెంటర్‌లో డైనింగ్ రూంతో పాటు, వంట శాల, వంట మనుషులు ఉన్నా భోజన వసతి ఎందుకు పునః ప్రారంభంచడం లేదని ప్రశ్నగా మిగిలింది. బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో ఉన్నత విద్యకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నత విద్యపై ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తుంది. కొల్లాపూర్ పీజీ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉన్నా భోజన వసతి లేకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.
కొల్లాపూర్ పీజీ సెంటర్లో 100మంది విద్యార్థులు ఉంటనే హాస్టల్ తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఉందని వైస్‌చాన్స్‌లర్ శ్రీనివాస్ విద్యార్థి సంఘాల నాయకులతో తెలిపారు. కానీ ప్రస్తుతం హాస్టల్లో 45 మంది విద్యార్థులే ఉన్నారు. రూరల్ ఏరియాలో ఉన్నత విద్య ఉంటే అక్షరాస్యత పెరగడంతోపాటు వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందననే ఆలోచనతోనే కొల్లాపూర్‌లో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి నిబంధనలు లే కుండా గత ప్రభుత్వ హయాంలో విద్యార్థు ల కోసం హాస్టల్‌ను కొనసాగిస్తే ఇప్పుడు పొమ్మనలేక పొగపెట్టినట్లు 100మంది విద్యార్థులు ఉంటే హాస్టల్‌ను కొనసాగిస్తామనడం పేద విద్యార్థులకు అందని ద్రాక్షలగా మార్చడమేనని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతంలో మెస్ చార్జీలతో సంబంధం లేకుండా భోజన వసతి ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఉన్నత విద్యనభ్యసించే పేద విద్యార్థులకు హాస్టల్ మెస్ చార్జీలు శాపంగా మారాయి. ఎన్నికలకు ముందు నిరుద్యోగులు, విద్యార్థులపై ప్రేమ చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూనివర్సిటీ మెస్ చార్జీలను భారీగా పెంచింది. దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు నోచుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏప్రిల్ 27వ తేదీన పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ డిపాజిట్ రూ. 10,100గా, ఓబీసీ విద్యార్థులకు రూ. 11,100గా, ఓసీ విద్యార్థులకు రూ. 16,100గా పెంచారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో సీట్లు వచ్చిన హాస్టల్ డిపాజిట్, బుక్స్ లాంటి ఇతర ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు ఉన్నత విద్యలో సైతం డ్రాఫౌట్స్గా మారుతున్నారు. అందుకే నల్లమల ప్రాంతంలో రవాణ సౌకర్యం కూడా లేని కొల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ పీజీ సెంటర్లో సైతం భారీ ఫీజులను చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
కొల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్టల్లో భోజన వసతి ఉంటే ఇప్పుడు ఎందుకు నడపడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఉన్నత విద్యపై ప్రేమ అర్థమవుతున్నది. వెంటనే హాస్టల్ భోజన వసతి కల్పించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.
– శేఖర్, బీఆర్ఎస్వీ నాయకుడు
దూర ప్రాంతం నుంచి ఉ న్నత విద్యను చదివేందుకు వచ్చాం. ఇక్కడ హాస్టల్లో భోజన వసతి లేకపోవడంతో అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నాం. బయట తిన్నాలంటే మా ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. హాస్టల్లో భోజన వసతి కల్పించాలి.
– భరత్, ఎంఎస్‌డబ్ల్యూ, విద్యార్థి