కొల్లాపూర్/వనపర్తి, జూలై 4 : తెలంగాణలో కొల్లాపూర్ మామిడి పండ్లకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. కేవలం రాష్ట్రం వరకే కాకుండా విదేశాలకు సైతం కొల్లాపూర్ మామిడి క్రేజ్ పాకిపోయింది. ప్రభుత్వం తరుపున వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు.
రాష్ర్టానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో సాగుచేస్తున్న వివిధ రకాల మామిడిచెట్లకు కాసిన కాయల నాణ్యతా ప్రమాణాలను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగుకు ప్రభు త్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా మాతృభూమిపై మమకారంతో వ్యవసాయాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు.