అయిజ, జూన్ 17 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగ ప్రాజెక్టుకు గరిష్ఠ నీటి మట్టం చేరుకోవడంతో గేట్లు ఎత్తారు. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తునున్నది. బుధవారం వరకు తుంగభద్ర డ్యాంలోకి ఇన్ ఫ్లో భారీగా చేరే అవకాశం ఉన్నది. తుంగ బరాజ్‌కు ఇన్‌ఫ్లో 31వేల క్యూసెక్కులు ఉండగా, 27వేల క్యూసెక్కులు అవుట్ ఫ్లో నమోదైంది. మంగళవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 14,800 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 160 క్యూసెక్కులు ఉన్నది.
గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1605.27 అడుగుల నీటి మట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 29.145 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా చేరుతోంది. ఇన్‌ఫ్లో 2,357 క్యూసెక్కులు ఉండగా, దిగువన ఉన్న సుంకేసుల బారాజ్‌కు 2,045 క్యూసెక్కులు చేరుతుండగా, ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 312 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.4 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు, జూన్ 17 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. మంగళవారం ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు కాగా వి ద్యుదుత్పత్తికి 20,763, నెట్టెంపాడుకు 1,500, కోయిల్‌సాగర్ లిఫ్టుకు 315, ఆవిరి రూపంలో 67 క్యూసెక్కు లు విడుదలవుతుండగా అవుట్‌ఫ్లో 22, 645 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 8.010 టీఎంసీలు కాగా 4, 303 టీఎంసీలు ఉన్నది.