అయిజ, జనవరి 3 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి విడుదల కొనసాగుతుండడంతో ఇన్ ఫ్లో ఆనకట్టకు చేరుతున్నది. శుక్రవారం ఆర్డీఎస్కు 86 4 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది. ఆర్డీఎస్ ప్రధాన కాల్వ కు 486 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, ఆర్డీఎస్ స్లూ యిస్ రంద్రాల గుండా దిగువకు 378 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు ఆర్డీఎస్ ఈఈ విజయ్కుమార్రె డ్డి తెలిపారు. టీబీ డ్యాం నుంచి జనవరి 5 వరకు నీటి వి డుదల కొనసాగనుండగా, జనవరి 10 వరకు ఆర్డీఎస్ ఆనకట్టలో నీటిమట్టం నిలకడగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ పెరుగుతున్న దృ ష్ట్యా ప్రధానకాల్వకు నీటి విడుదలను మరింత పెంచేందు కు చర్యలు తీసుకుంటామని ఈఈ పేర్కొన్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతున్నది. శుక్రవారం ఇన్‌ఫ్లో 120 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 8,818 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాం లో ప్రస్తుతం 79.334 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గానూ ప్రస్తు తం 1625.86 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.