అయిజ/శ్రీశైలం, జూలై 11 : కర్ణాటకలోని ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శుక్రవారం జూరాలకు ఇన్‌ఫ్లో 1,09, 000 క్యూసెక్కులు ఉండగా, 10గేట్లు ఎత్తి దిగువకు 67, 250 క్యూసెక్కులు విడుదల చేశారు. జల విద్యుత్ ఉత్పత్తికి 30,361, నెట్టెంపాడ్ లిఫ్టుకు 750, భీమా లిప్టు-1కు 1,300, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 460, ఆర్డీఎస్ లింక్ కాల్వకు 150, పారలాల్ కాల్వకు 800, భీమా లిఫ్టు-2కు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
జూరాల ద్వారా మొత్తం అవు ట్ ఫ్లో 1,02,050 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.740 టీ ఎంసీల నిల్వ ఉన్నది. తుంగభద్ర డ్యాం 11 క్రస్ట్ గేట్లు 2.5 అ డుగుల మేరకు ఎత్తి దిగువకు 25,560 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 43,091 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 34,351 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 76.16 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 45, 982 క్యూసెక్కులు ఉండగా, ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 45,387 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 10.9 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. మూడు క్రస్ట్ గేట్లను 10అడుగుల మేర ఎత్తి 81,333 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో 1,77,873 క్యూసెక్కులు నమోదైంది. కుడి, ఎడమ జల వి ద్యుతోత్పత్తి కేంద్రాల ద్వారా 67,535 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలకు ప్రస్తుతం 203.8904 టీఎంసీలు ఉన్నాయి.