గద్వాల, ఆగస్టు 25 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా దిగువకు 41,192 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.000 మీటర్లుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 8.611 టీఎంసీలుగా ఉన్నది. నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, జూరాల ఎడమ కాల్వకు 550, కుడికాల్వకు 485, కోయిల్‌సాగర్‌కు 315, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 100, విద్యుత్ ఉత్పత్తికి 39,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, ఆగస్టు 25 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్వ ల్పంగా కొనసాగుతోంది. ఆదివారం ఇన్‌ఫ్లో 19,989 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 10,023 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 86.274 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ ప్రస్తు తం 1627.87 అడుగులు ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 12,233 క్యూసెక్కు లు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 11,400 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 633 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 9.2అడుగుల మేరకు నీటిమట్టం ఉన్నది.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 28,838 క్యూసెక్కులు చేరుతుండగా, అవుట్ ఫ్లో 28,838 క్యూసెక్కులు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 1705 అడుగులకు గానూ ప్రస్తుతం 1704.72 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి గరిష్ఠ నీటి మట్టం 129.72 టీఎంసీలకు గా నూ ప్రస్తుతం 128.19 ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 28,480 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 34,199 క్యూసెక్కులు ఉన్నది. గరిష్ఠస్థాయి నీటి మట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1613.85 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 36.54 టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.