వనపర్తి :పట్టణంలో మూడు రోజుల క్రితం అక్షర స్కూల్లో మైనారిటీ బాలికపై జరిగిన అఘాయిత్యంపై ప్రశ్నించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ (BRS ) నాయకుల అరెస్టును నిరసిస్తూ గురువారం పోలీసు స్టేషన్ ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ (BRS ) నాయకులు నందిమల్ల అశోక్, మెకానిక్ శ్రీనుతో పాటు చీర్ల చందర్, మరో ఆరుగురుపై అక్రమ కేసులు ( Illegal Arrests ) నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు.

అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు గట్టు యాదవ్ ,వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిందితుడిని, యాజమాన్యాన్ని కాపాడాలని,ఎమ్మెల్యే చేసిన భారీ కుట్రలో భాగంగానే నాయకులను అరెస్ట్ చేసిన తమ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వపరంగా బాధిత బాలికకు,కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్ గౌడ్, పెద్దిరాజు, కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్ మున్సిపల్ కౌన్సిలర్లు, మురళి సాగర్ , శ్రీకర్ గౌడ్, చింటూ , సమద్, స్టార్ రహీం, హేమంత్ ముదిరాజ్, జోహార్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్ రెడ్డి, చిట్యాల రాము, సీపీఎం నాయకులు పరమేశ్వరా చారి , సీపీఐ నాయకులు గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.