బిజినపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ప్రభుత్వం అందజేస్తుందని జరుగుతుందని జిల్లా కలెక్టర్ సంతోష్(Collector Santosh) ,ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు ( MLA Rajeshreddy) అన్నారు. గురువారం బిజినేపల్లి మండలం కేంద్రంతో పాటు,మంగనూరు గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారుల వినియోగించుకోవాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు,పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని అన్నారు.ఈ పథకం ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు.
లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,మండల నాయకులు,గ్రామ పెద్దలు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.