మరికల్, ఏప్రిల్ 29 : గత ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెకానిక్ శివ కుటుంబానికి మంగళవారం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ మెకానికల్ సంఘం ఆధ్వర్యంలో శివ కుటుంబానికి 30 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సంఘం అధ్యక్షుడు పోతులమడుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో శివ మృతి చెందడం దురదృష్టకరమన్నారు.
శివ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల ఎలక్ట్రిషన్ సంఘ అధ్యక్షుడు మాకం శ్రీనివాసులు, మెకానిక్ లో కుర్వ మల్లేష్, గౌని చంద్రారెడ్డి, టంకర శ్రీనివాసులు, రవి గౌడ్, ప్రవీణ్,వెంకటేశ్, రియాజ్, లక్ష్మారెడ్డి,కేశవులు, రఘునాథ్ రెడ్డి,నవీన్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.