గండీడ్ : రైతులకు ఎరువులు(Fertilizers) , విత్తనాలు ( Seeds ) అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకటేష్ ( DAO Venkatesh) కోరారు. గురువారం గండీడ్ మండల పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు ,విత్తనాలు అధిక ధరలకు అమ్మరాదని , విత్తనాలు, ఎరువులు అమ్మిన వెంటనే రసీదులు ఇవ్వాలని సూచించారు.
రైతులు రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. యూరియా, డీఏపీ , అందుబాటులో ఉందని అవసరం ఉన్న రైతులు తీసుకోవాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రైతులు 30శాతం మాత్రమేరిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగతా రైతులు చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి నరేందర్ , ఎరువుల దుకాణాల డీలర్లు ఉన్నారు.