గద్వాల, మార్చి 23 : కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులు పం డించి వరి ధాన్యానికి మద్ధతు ధరతోపాటు బోనస్ రూ.500 చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మాట మార్చి కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించడంతో ఆదినుంచే రైతులను మోసం చేసే పక్రియ ప్రా రంభించారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా ఎకరాకు ఎటువంటి నిబంధనలు లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.15వేలు చెల్లిస్తామని చెప్పి దానిని రూ. 12వేలకు కుదించి రైతులను మోసం చేశా రు. సన్నాలకే రూ.500 బోనస్ వస్తుందిలే గిట్టుబాటు ధర రాకున్నా దీంతో సరి పెట్టుకోవచ్చని రైతులు భావిస్తుండగా అదికూడా సక్రమంగా రైతుల ఖాతాలో జమచేయడం లేదు.
దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసిన వారంలోగా బోనస్ చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మూడు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో బోనస్ చెల్లించక పోవడంతో రైతులు పెట్టుబడుల కోసం నా నా అవస్థలు పడుతున్నారు. ఇటు రైతులకు ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వక, అటు బోన స్ జమ చేయకపోవడంతో రైతులు ఆసాముల దగ్గర తెచ్చుకున్న అప్పులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో వడ్డీ లు కట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమకు బోన స్ చెల్లించాలంటూ రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అం దజేసిన ఫలితం శూన్యం. ధాన్యం మాత్రం కొనుగోలు చేశా రు. కానీ బోనస్ వేయడం మరువడంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వెంటనే బోనస్ చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం కొనుగోలు సెంటర్ల ద్వారా రైతుల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలో 67వేల మెట్రీక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసింది. ఇందు కోసం రైతులకు బోనస్‌గా రూ.33,86,09,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ. 18,25,87,600 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇంకా జిల్లాలోని రైతులకు రూ.15, 60,22, 200 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉన్నది.
దీనికోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రతి గ్రామం లో కొంతమందికి పడడం మిగతా రైతులకు పడకపోవడంతో తమ ఖాతాలో బోనస్ జ మ చేస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. అయిజ మండలంలోని బైనపల్లి, పులికల్, కొత్తపల్లి, మేడికొండ, రాజాపూర్, చిన్నతాండ్రపాడ్, సింధనూర్తోపాటు జిల్లా లో చాలా గ్రామాల్లో రైతులకు బోనస్ పడ డం లేదు. వరిధాన్యం అమ్మిన చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేయడంతో రైతులు ప్ర భుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ రాని రైతుల మాటలు వారి ఆగ్రహం వారి మాటల్లో…
నేను 116 క్వింటాళ్ల వడ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ధాన్యం విక్రయించి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు బోన్స్ నా ఖాతా లో జమ కాలేదు. నాకు బోనస్ కింద రూ. 58వేలు రావాల్సి ఉన్నది. నాకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో ఆసాముల దగ్గర తెచ్చిన అప్పు చెల్లించలేక పోవడంతో వడ్డీలు మీద పడుతున్నాయి. ప్రభు త్వం ఇటు బోనస్ జమచేయక అటు రైతు భరోసా ఇవ్వక ఆం దోళన చేందాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతుల ఖాతాల్లో బోనస్ జమచేయాలి.
– బందెనవాజ్, బైనపల్లి, అయిజ మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు.ఎన్నికల సమయంలో ధాన్యం కొనుగోలు చేసిన వారంలోగా బోనస్ రైతు ల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు జమ చేయలేదు. 62 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించా. నాకు రూ.31వేల దాక బోనస్ రావాల్సి ఉంది.
– నూర్ అహ్మద్, బైనపల్లి, అయిజ మండలం
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చి న మాట ప్రకారం వెంటనే రైతుల ఖాతాల్లో బోనస్ జమచేయాలి. బోనస్ జమ చేయక పోవడంతో రైతులం ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోలు కేంద్రంలో 153 క్విం టాళ్ల ధాన్యం అమ్మా. నాకు సుమారు రూ. 76వేలు రావాల్సి ఉంది. అయితే ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు మా ఖాతాల్లో బోనస్ జమచేయలేదు. ప్రభుత్వం బోనస్ జమ చేయక పోవడంతో ఆందోళనలు చేయాల్సి వస్తుంది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాల మోసం చేసింది.
– ఉరుకుందు, బైనపల్లి, అయిజ మండలం