జడ్చర్ల, మే 8 : మొక్కజొన్న కొనుగోళ్లు చేయడం, ఎత్తడంలో ఆలస్యం జరుగుతుండటంతో రోజుల తరబడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగులు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా బాదేపల్లి పీఏసీసీఎస్ వారు మక్కలు కొనుగోలు చేస్తున్నారు. కొన్నా వాటిని లోడింగ్ చేయకపోవడంతో రైతులకు రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు తప్పడం లేదు.
జడ్చర్ల పత్తి మార్కెట్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లో ఇప్పటి వరకు 70వేల బస్తాలను కొనుగోలు చేయగా 30 వేల బస్తాలను లారీల్లో గోదాంలకు తరలించారు. ఇంకా 40 వేల బస్తాలు మార్కెట్లోనే మిగిలిపోయాయి. అదేవిధంగా రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన మక్కలు 20 వేల బస్తాలకుపైగానే ఉన్నాయి. నిత్యం కేంద్రానికి మక్కలను అన్నదాతలు తీసుకొస్తూనే ఉన్నారు.
దీంతో మార్కెట్‌యార్డు పూర్తిగా మక్క కుప్పలతో నిండిపోయింది. అయితే కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే రైతులు వాటిని అమ్మడంతో పాటు లారీల్లోకి ఎత్తేవరకు వారిదే బాధ్యత అని అధికారులు సూచించారు. దీంతో కొన్న మక్కను బస్తాల్లోకి నింపి తూకం వేసినా వాటిని లారీల్లోకి లోడింగ్ చేసే దాంట్లో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో రైతులు 25 రోజులుగా మార్కెట్లోనే తిండి తిప్పలు, వ్యవసాయ పనులు మానుకుని కుప్పల వద్దే నిరీక్షిస్తున్నారు. అదీ గాక అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకే బస్తాలను త్వరగా ఎత్తాలని డిమాండ్ చేస్తున్నారు.
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన బస్తాలను గోదాంకు తరలించేందుకు జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల వద్ద ఉన్న బాదేపల్లి పీఏసీసీఎస్ గోదాంను లీజుకు తీసుకున్నారు. లారీల్లో మక్క బస్తాలను లోడింగ్ చేసి గోదాం వద్దకు పంపినా హమాలీల కొరతతో అన్లోడ్ చేయడంలో ఆలస్యమవుతోంది. దీంతో లారీల డ్రైవర్లు రావడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తాము ఇంతగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మార్క్‌ఫెడ్, జిల్లా అధికారులు స్పందించి లారీలను, హమాలీల సంఖ్యను అదనంగా ఏర్పాటు చేసి మక్క రైతుల ఇబ్బందుల తొలగిపోయే అవాకాశం ఉన్నది.
మక్క కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి మొక్కలను కొనుగోలు చేసినా వాటిని గోదాం వద్ద లారీల్లోని బస్తాలను దించుకోవడంల్లో ఆలస్యం జరుగుతుంది. గోదాం వద్దకు లారీ ల్లోని మక్కలను దించుకోవడానికి సరిపడా హమాలీలు లేకపోవడంతో లారీల వారు రావ డంలేదు. ఇప్పటి వరకు 70వేల బస్తాలకు పై గానే మొక్కజొన్నలను కొనుగోలు చేశామని, 30వేల బస్తాలు గోదాంలో దించుకున్నారు. ఇంకా 40వేల పైగా బస్తాలు మార్కెట్లో ఉన్నాయి. అదీనుగాక మార్కెట్ ఆవర
ణలో రైతులకు సంబంధించి ఇంకా 20 వేల బస్తాలు ఉంటాయి. గోదాం వద్ద లారీలను త్వరగా ఖాళీ చేస్తే ఒకటి రెండ్రోజుల్లో మార్కెట్ ఖాళీ అవుతుంది.
– యాదగిరి, బాదేపల్లి పీఏసీసీఎస్ సీఈవో