అయిజ, అక్టోబర్ 26 : పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాలయ క్ర యవిక్రయాలు జరుపుకోవాలని మున్సిపల్ సిబ్బంది వాహనాలు నిలుపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయిజ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్ఎఫ్సీ, గ్రాంట్తో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం రూపుదిద్దుకున్నది. శనివారం నుంచి ఇం టిగ్రేటెడ్ మార్కెట్లోనే కూరగాయల క్రయవిక్రయాలు జరుపుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి రైతులు తీసుకొచ్చిన కూరగాయల వాహనాలను అడ్డుకొని ఇం టిగ్రేటెడ్ మార్కెట్కు మున్సిపల్ సిబ్బంది తరలించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సౌ కర్యాలు లేవని, ట్రాఫిక్ సమస్య అవుతుందని, వ్యవసాయ సబ్ మార్కెట్లోనే క్ర యవిక్రయాలు చేస్తామని మున్సిపల్ సిబ్బందితో రైతులు వాగ్వివాదానికి దిగారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కూరగాయల వాహనాలను వ్యవసాయ సబ్ మార్కెట్కు తరలించాలని రైతులకు సూచించారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ దేవన్న, మున్సిపల్ సిబ్బంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో క్రయవిక్రయాలు జరుపుకోవాలని ఏజెంట్లు, రైతులకు అవగాహన క ల్పించారు. సౌకర్యాలు కల్పించడంతోపాటు వాహనాల రద్దీకి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఏజెంట్లు, రైతులు మున్సిపల్ అధికారులను కోరారు.