హన్వాడ, మార్చి 25 : వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఆకాల వర్షానికి నష్టపోయిన వరి పంటను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు రుణమా ఫీ, పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.15వేలు, కౌలు రైతులకు రూ. 12వేలు ఇస్తామని చెప్పి తీరా గెలిచిన తర్వాత ఆ హామీలు ఎందుకు అమలు చే యడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని అసెంబ్లీలో ప్రకటన చేయడం సిగ్గు చేటన్నారు.
ప్రస్తుతం రైతులు అకాల వర్షంతో పంటలు దెబ్బతిని లబొది బో మంటున్నారని, వ్యవసాయాధికారులు వెంటనే పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అం దించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా చాలా చోట్ల పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయని వాటికి కరెంట్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు బోనస్ ఇస్తామని చేప్పి వడ్లు కోనుగోలు చేసి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బోనస్ ఇవ్వలేదని ప్రభుత్వం స్పం దించి వందశాతం రుణమాఫీ చేయడంతోపాటు బోనస్ చెల్లించాలని, పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజ్ హైదరాబాద్‌లో ప్రమాదశాత్తు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరామర్శించారు.
ఆయ న వెంట పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ స ర్పంచులు చెన్నయ్య, వెంకన్న, మాజీ ఎంపీటీసీ పెద్దచెన్నయ్య, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు రాజుయాదవ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు హరిచందర్, నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, అనంతరెడ్డి, మాధవులుగౌడ్, అంజి, రామక్పష్ణ ఉన్నారు.
రూ.1.20 లక్షల పెట్టుబడి అయ్యింది..
నాకున్న మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. పంట సాగు కోసం రూ.లక్షా 20 వేలు పెట్టుబడి అయ్యింది. చేతికొచ్చే సమయంలో అకాల వడగండ్ల వర్షానికి పంట పూర్తిగా దెబ్బ తిన్నది. దీంతో పంట కోసం తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. ఇప్పటి వరకు పెట్టుబడి కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మామీలను చూసి మోసపోయి ఓటు వేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం.
– పాశం నారాయణ, రైతు, నాయినోనిపల్లి