మానవపాడు, ఆగస్టు 20 : ‘రేవంత్ సర్కారు అమలు చేసిన పంట రుణమాఫీ మాకు వర్తించదా..? బీఆర్ఎస్ హ యాంలో రూ.లక్ష వరకు ప్రతి రైతు తీసుకున్న క్రాప్లోన్లు మాఫీ అయ్యాయి.. ఇప్పుడెందుకు జరగడం లేదు’.. అని అధికారులను రైతులు నిలదీశారు.
మంగళవారం మానవపాడు రైతువేదికలో నిర్వహించిన సమావేశానికి ఏడీఏ సక్రియానాయక్, ఏఈవో సుబ్బారెడ్డి హాజరయ్యారు. అధికారు లు వస్తున్నారన్న విషయం తెలుసుకొన్న రుణమాఫీ కాని రైతులు భారీగా అక్కడకు చేరుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిం చి.. మూడు విడుతల్లో నేడు కొర్రీలు పెడుతూ అందరికీ అం దించడం లేదని ధ్వజమెత్తారు.
రూ.20 వేల నుంచి రూ.2 లక్షల రుణం ఉన్న రైతులు చాలా మందిరిక మాఫీ కాలేదని వాపోయారు. దీంతో రైతులు బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు మాఫీ అవుతుదా..? అని ప్రశ్నించారు. దీనికి అధికారులు మాత్రం తెలియదని, మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పి చేతులు దులుపుకొన్నారు.