గండీడ్/మహ్మదాబాద్, నవంబర్ 26 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. గండీడ్ మం డలంలోని కొండాపూర్‌లో శనివారం ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వమే ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
అనంతరం గండీడ్, జూలపల్లి గ్రామాల్లో పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే జూలపల్లిలో విద్యుదాఘాతంతో మృతి చెం దిన పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి రూ.5లక్షల చెక్కును అందజేశారు. మహ్మదాబాద్ అయ్యప్పకొండపై జెడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గిరిధర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సలీం, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి, సర్పంచులు శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, రాఘవేందర్, కిరణ్‌కుమార్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, నా యకులు రాంచంద్రారెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, తిర్మల్‌రెడ్డి, వెంకటయ్య, జోగుకృష్ణ, గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.