వనపర్తి, మే 22(నమస్తే తెలంగాణ) : గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ గో దాంలో వరి ధాన్యం దిగుమతి చేసుకోవడం లో అలసత్వం వహించడంపై రైతులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ప్రభుత్వ తీరుపై కడు పు మండిన రైతులు ఏకంగా శుక్రవారం నా లుగు గంటల పాటు గోపాల్పేట-ఏదుట్ల రో డ్డుపై గోదాం ఎదుట ధర్నాకు దిగారు. ఉమ్మ డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు తూకం వేసిన బస్తాలను గోపాల్పేట గోదాంకు తరలించాలని అధికారులు చెప్పారు. లారీలు సమయానికి రానందునా రైతులే స్వయంగా ట్రాక్టర్లతో 10 గ్రామాల నుంచి తూకం వేసిన ధాన్యాన్ని గోదాంకు తీ సుకొచ్చారు. అయితే, ట్రాక్టర్లు భారీగా రావ డం, గోదాంలో హమాలీల సంఖ్య తగ్గట్టుగా లేకపోవడంతో సమస్య జఠిలమైంది. రెండు రోజులుగా వేచిచూస్తున్నా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహించారు.
కూడా లేని హమాలీలతో తమ ధాన్యాన్ని దించాలంటే 20 రోజులు పడిగాపులు కాయా ల్సి వస్తుందని ఆగ్రహం చెందారు. ఇదే క్రమ ంలో రైతులంతా రోడ్డుపైకి చేరి ఆందోళనకు దిగారు. ఈ రైతుల సమస్యకు బీఆర్ఎస్ మం డల నాయకులు మద్దుతు పలికారు. తాసీల్దార్ తిలక్రెడ్డి, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనతో వాహనాలు రో డ్డు పొడవునా బారులుదీరాయి. రైతులు అడిగిన న్యాయమైన సమస్యకు అధికారులు సమాధానాలు చెప్పలేకపోయారు. చివరకు అదనపు కలెక్టర్‌కు సమస్యను వివరించడం తో తానే స్వయంగా వస్తున్నానని, సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో గోపాల్పేట మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ రమేశ్ యాదవ్, అశోక్ కుమార్, చంద్రశేఖర్, మణ్యం నాయక్, కాశీనాథ్, నర్సింహ, రాజేశ్, ప్రవీణ్‌కుమార్ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.