మహబూబ్‌నగర్, జనవరి 28 (నమస్తే తె లంగాణ ప్రతినిధి):/ పాలమూరు : వేరుశనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం పాలమూరు జిలా కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటలపాటు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. అం తటితో ఆగకుండా సమీపం లోని బో యపల్లిగేట్ వద్ద రైల్వేలైన్‌పై ఆందోళన చేపట్టడంతో అటుగా వస్తున్న గూడ్స్ రైల్‌ను లోకో పైలట్ చాకచక్యంగా నిలిపి వేశారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారి ంది. హుటాహుటిన ఎస్పీ జానకి ఆందో ళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వేలైన్‌పై బైఠా యించిన రైతులను సముదాయించి మార్కెట్ యార్డ్‌కు తీసుకువెళ్లారు. కాగా రైతులు ఆందోళన చేస్తుంటే పాలకవర్గంతోపాటు అధికార యంత్రా ంగం చేష్టలుడికి చూస్తోంది.
మార్కెట్ అధికారు లు, పాలకవర్గం వ్యాపారులతో కుమ్మక్కవడంతో గిట్టు బాటు ధర దక్కడంలేదని రైతులు ఆరోపి స్తున్నారు. వారం రోజులుగా మహబూబ్‌నగర్ మార్కె ట్ యార్డ్‌కు వందల క్వింటాళ్ల వేరుశనగ తీసుకొచ్చినా కొనడం లేదని వ్యాపారులంతా సిండికేటై తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు మండిపడ్డారు. కాగా మహ బూబ్‌నగర్ మార్కెట్ యార్డ్‌కు తీసుకొచ్చిన పల్లికి ప్రభుత్వం రూ.6,190 ధర నిర్ణయిం చింది. అయితే వ్యాపారులు మాత్రం రూ.5,700 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహించా రు. ఈ విషయాన్ని అధికారులు, పాలక వర్గానికి చెప్పినా పట్టించు కోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పెద్ద ఎత్తున ఆం దోళనకు దిగారు.
పరిస్థితి చేయి దాటి పో తుండడంతో పోలీసు యంత్రా ంగం అక్కడికి చేరుకొని పరిస్థితిని అదు పులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్‌కు రైతులు వారం రోజులుగా పెద్ద ఎత్తున వేరుశనగ అమ్మకానికి తీసుకొచ్చారు. మహబూబ్‌గర్ అర్బన్, రూరల్ మండలంతో పాటు నవాబ్‌పేట, గండీడు, మహ్మదాబాద్ మండలాల నుం చి పెద్ద ఎత్తున వేరుశనగ తరలించి కొనుగోలు కోసం నిరీక్షిస్తు న్నారు. అయితే వ్యాపారులు రైతుల వద్ద కొంటున్న సమ యంలో తక్కువ తూకం చేస్తూ మోసానికి పాల్పడు తుం డడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మంగళవా రం వేరుశనగకు గరిష్ఠ ధర మార్కెట్ అధికారులు రూ. 6,190 నిర్ణయిం చారు.
ఈ ధరకు కొనుగోలు చేయక పో వడంతో రైతులకు కోపం తెప్పించింది. మార్కెట్ అధికారు లు, పాలకవర్గానికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆందో ళన బాట పట్టారు. కాగా మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటా కు రూ.6,190 గరిష్ఠ ధర.. కనిష్ఠ రూ. 3300గా నిర్ణయి ంచారు. అయితే తేమశాతం ఉందంటూ వ్యాపారులు సిండికేట్‌గా మారి క్వాలిటీ ఉన్న వేరుశనగను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ఇదే విషయాన్ని అధికారులు, పాలకవర్గానికి చెప్పి నా పట్టించుకో కపోవడంతో ధర్నాకు దిగారు.
మార్కెట్ కార్యాలయం దిగ్బంధం
వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధి ంచారు. సుమారు 4గంటలపాటు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అయినా అధికారులు, పాలకవర్గం కార్యాలయంలోనే ఉండి కూడా రైతుల దగ్గరికొచ్చి పరిస్థితి వివరించలేకపోయింది. ఆగ్రహించిన రైతులు సమీపంలోని రైల్వేగేట్ వద్దకు చేరుకొని ఆందోళనను ఉధృతం చేశారు. అంతలోని గూడ్స్ రైలు అటుగా వస్తుండడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పట్టాల మీద వందలాది మంది రైతులు నిలబడి ఆందోళన చేస్తుండడంతో అటుగా వస్తున్న గూడ్స్‌రైలు లోకో పైలట్ వెంటనే రైలును ఆపివేయడంతో ప్రమాదం తప్పింది.
విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి హుటాహుటిన బోయపల్లి గేటుకు చేరుకున్నారు. అప్పటికే మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, వన్ టౌన్ సీఐ అప్పయ్య నేతృత్వంలో భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పట్టాలపై నుంచి వారిని పక్కకు తీసుకువెళ్లి మార్కెట్ యార్డు గేటు వద్ద ఆందోళన చేయాలని సూచించారు. దీంతో అటుగా వెళ్తున్న వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపో యాయి. చివరకు రైతులు మార్కెట్ యార్డును ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పట్టించుకోని పాలకవర్గం
మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులో కొన్నిరోజులుగా వేరుశనగలు పండించిన రైతులు భారీ ఎత్తున అమ్మడానికి తీసుకోస్తుండగా.. తగిన ఏర్పాట్లు చేయడంలో పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. అధికారులు కూడా వస్తున్న వేరుశన గకు మద్దతుధర కల్పించడంలో నిర్లక్ష్యం వహించడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒకటి అయితే దానికి దాదాపు రూ.600 తగ్గించి కొ నుగోలు చేస్తుండడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఇదేమిటని పాలకవర్గాన్ని, అధికారులను నిలదీసినా పట్టిం చుకోకపోవడంతో మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయి ంచారు.
ఒక దశలో కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందు కు ప్రయత్నించారు. అయినా మార్కెట్ చైర్మన్ అనిత అ ధికారులతో లోపలే ఉండి సమీక్షించుకుంటూ కూర్చుంది. బయట మూడు, నాలుగు రోజులుగా కొనుగోలు కోసం కం డ్లల్ల్లో ఒత్తులు వేసుకున్న రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారులు సతాయిస్తుండడంతో ఆందోళన చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం వెంటనే అక్కడికి చేరుకొని ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. దీంతో ఆందోళన బాట హింసాత్మకం కాకుండా రైతులను నచ్చజె చెప్పారు.
క్వింటాకు రూ.200 ధరతో సరి
మార్కెట్ యార్డుకు వారం రోజులుగా వేరుశనగ కాయలు తీసుకొచ్చి రాత్రింబవళ్లు అక్కడే పడుకొని కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్న రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా తూకంలో మోసం చేస్తుండడంతో రైతులు కడుపు రగిలి మండిపో యారు. వ్యాపారులంతా కుమ్మక్కై వేరుశనగకు మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధర చెల్లిస్తుండడంతో ఆగ్రహం చెందిన రైతులు 4గంటలపాటు ఆందోళన చేపట్టారు. దీంతో దిగి వచ్చిన మార్కెట్ అధికారులు, పాలకవర్గం వ్యాపారులతో చర్చించి కేవలం రూ.200 మేరకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయినా రైతులు వినలేదు. ప్రభుత్వం నిర్ణ యి ంచిన గరిష్ఠ ధరకు వేరుశనగ కొనాలని డిమాండ్ చేస్తూ బైఠా యించారు. చివరకు పెంచిన ధర మాత్రమే ఇస్తామని చెప్పిన వినలేదు. అయితే తెచ్చిన వేరుశనగను వెంటనే కొనుగోలు చేయాలని.. తూకంలో మోసాలు అరికట్టాలని.. కొన్న వెం టనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కొనుగోళ్లు ప్రారంభించారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో వేరుశనగలు కొంటామని ప్రకటించడంతో రైతులు శాంతించారు.
ఎకరాలో పల్లీ సాగు చేసాం
క్వింటా పల్లి విత్తనాలు రూ.14వేలకు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం మాత్రం రూ.4,200 ధరకు కొనుగోలు చేసింది. పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదు. అప్పు చేసి పంటసాగు చేశాం. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించాలి. ప్రభుత్వం దయచేసి కనీస ధర రూ.8వేలపైన కొనుగోలు చేస్తే రైతులకు మేలు కలుగుతుంది.
– కృష్ణవేణి, చెన్నారం, మద్దూరు మండలం
మద్దతు ధర లేక ధర్నా చేశాం
మార్కెట్‌కు ధాన్యం తెచ్చినాక మద్దతు ధర ఇవ్వాలని అడిగినా అధికారులు పట్టించుకోలేదు. క్వింటా విత్తనాలు వేయడానికి రూ.15వేలు పెట్టి కొనుగోలు చేస్తే ప్రభుత్వ మద్దతు ధర రూ.6190 ఇస్తామంటుండ్రు. పల్లి పండించడానికి పెట్టుబడి కూడా రావడం లేదు. గతపంట రూ.8వేల పైన పోయింది. ఇసారి చాలా తక్కువ ధరకు కొంటుండడంతో నష్టపోతున్నాం. ప్రభుత్వ మద్దతుబాటు ధర అందించాలి.
– కరుణాకర్‌రెడ్డి, వెన్నచేడ్, గండీడ్ మండలం
కౌలుకు పదెకరాల్లో పల్లీ పండించా..
పదేకరాల్లో 70సంచుల పల్లీ పండింది. ప్రభుత్వ ధర రూ.4800 క్వింటా ధర పలికింది. నేను రూ.3లక్షలకుపైగా పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు అమ్మిన ధర పెట్టుబడి ఖర్చు కూడా వస్తలేదు. రూ.2లక్షలపైన నష్టపోతున్నాం. మద్దతు ధర కోసం నిరసన చేస్తుంటే పోలీసులొచ్చి తోస్తున్నారు. కనీసం పెట్టుబడి ధర కూడా రాకుంటే మేము ఎలా జీవించాలి. ప్రతి రైతు ఈ ధరకు కన్నీరు పెడుతుండు. దయచేసి ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందజేసి ఆదుకోవాలి.
– వెంకటప్ప, నిడ్జింత, కొత్తపల్లి మండలం, నారాయణపేట