బిజినపల్లి : రైతులు పంటల సాగులో తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులను ( Fertilizer ) వాడాలని శాస్త్రవేత్తలు (Agricultural scientists) నళిని,కళ్యాణి సూచించారు. బిజినపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఎర్రకుంటతండా, ఊడుగుల కుంట తండాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పంటలు పండించడంలో నీటిని తక్కువ వాడాలన్నారు. బిందుసేద్యం, స్ప్రీంక్లర్లు వాడకం, నీటి యాజమాన్యం, పంట మార్పిడి గురించి వివరించారు. ఫర్టిలైజర్ దుకాణాలలో విత్తనాలు, ఎరువులు కొన్న తర్వాత రసీదులను భద్రపరచుకోవాలన్నారు. సేంద్రియ వ్యవసాయం, మొక్కల పెంపకం వంటి వాటిపై అవగాహన కల్పించారు. నేలకు అనుకూలమైన పంటలను వేసుకోవాలన్నారు. పంటలు వేసేటప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో నీతి, వంశీ నాయక్ రైతులు ఉన్నారు.